నేడు ‘దాశరథి కృష్ణమాచర్య’ జయంతి!

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!

తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి,
నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన అజగవుడు!

పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని,
తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు!

“నా తెలంగాణ – కోటి రతనాల వీణ” అని గర్వంగా ప్రకటించి,
తెలంగాణా సాధనకి ప్రేరణనందించిన తెలంగాణా ముద్దుబిడ్డడు!

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించిన చైతన్యుడు!
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో పదునైన దార్శినికుడు!

భావప్రేరిత ప్రసంగాలతో,
ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించిన భావకుడు!

“మీర్జాగాలిబ్” ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేరిట అనువదించిన కవీంద్రుడు!

సినీలోకానికి సాహితీ సౌరభాలద్ది,
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సాహితీమూర్తుడు!

మహాంధ్రోదయంలో రుద్రవీణ మ్రోగించి,
తిమిరంతో సమరం జరిపి,
ధ్వజమెత్తిన ప్రజల్లో ఆలోచనాలోచనాలు రేకెత్తించి,
మార్పు నాతీర్పు అంటూ కవితా పుష్పకం లో ముద్రించి,
తెలుగుజాతిలో వెలుగుల జ్యోతిని నింపిన మహాకవి దాశరధి!

1961 లో ‘ఇద్దరుమిత్రులు’ సినిమాలోని
‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ అనే పాటతో సినీరంగ ప్రవేశం చేసి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు!

నేడు ‘దాశరథి కృష్ణమాచర్య’ జయంతి!

ఆయన దివ్యస్మృతికి అంజలి ఘటిస్తూ………………….