రాజు గారి దర్శకుడు, దగ్గుబాటి హీరోని బాలన్స్ చేయగలడా?

వెంకీమామతో బిజీగా ఉన్నా విక్టరీ వెంకటేష్… ఈ సినిమా తర్వాత ధనుష్ అసురన్ రీమేక్ లో నటిస్తాడని ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. తమిళ నిర్మాత, సురేష్ బాబు కలిసి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాతో వెంకటేష్ యాక్షన్ మోడ్ లోకి దిగడానికి రెడీ అయ్యాడు. వెంకీ మామ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం వెంకటేశ్ తన లుక్ పూర్తిగా మార్చేస్తూ గడ్డం పెంచడానికి రెడీ అయ్యాడు.

Asuran Venkatesh

హీరో వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు… ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇంతకీ దర్శకుడు ఎవరు అనే మాట మాత్రం వినిపించట్లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అసురన్ రీమేక్ బాధ్యతలని ఓంకార్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రాజు గారి గది పేరుతో హారర్ కామెడీ సినిమాలు మాత్రమే చేసిన ఓంకార్, 150 కోట్లు వసూళ్లు చేసిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎంత వరకూ న్యాయం చేస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే. ఓంకార్ మాత్రం వెంకటేష్ తో సినిమా చేయాలని, చేస్తానని చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాడు. ఇన్ని రోజులకి అది నిజమయ్యేలా కనిపిస్తోంది.