సల్మాన్ కోసం రామ్ చరణ్ వస్తాడా?

దబాంగ్… సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సల్మాన్ చెప్పిన డైలాగ్స్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు, చుల్ బుల్ పాండే బాక్సాఫీస్ ని దున్నేశాడు. అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ సల్మాన్ దబాంగ్ సిరీస్ ని స్టార్ట్ చేసి, ఇప్పుడీ ఫ్రాంచైజ్ లోని మూడో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబాంగ్ 3 సినిమాని కేవలం హిందీలోనే మాత్రమే కాకుండా అన్ని దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

డిసెంబర్ 20న విడుదల కానున్న దబాంగ్ 3 తెలుగు మోషన్ పోస్టర్ ని సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. సల్మాన్ కి వెల్కమ్ చెప్తూ రామ్ చరణ్ తేజ్ తెలుగు మోషన్ పోస్టర్ ని షేర్ చేశాడు. అయితే దబాంగ్ 3 సినిమా తెలుగు వెర్షన్ కి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్, సల్మాన్ మంచి ఫ్రెండ్స్ కావడంతో అతని కోసమే చరణ్ చుల్ బుల్ పాండేగా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఓకే చెప్తాడని అంతా అనుకుంటున్నారు. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.