ఆ కళ్లు ఎవరివి బాబు?

టాలీవుడ్ లో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో రవిబాబు ఒకరు. గతంలో ఎన్నో హిట్స్ అందుకున్న రవిబాబు ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ఆవిరి. దెయ్యం సినిమాలను తెరక్కించడంలో తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసిన రవిబాబు మరోసారి అదే జోనర్ ని నమ్ముకున్నట్లున్నాడు. నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముక్తార్ ఆవిరి సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో రవిబాబు ఒక అమ్మాయి ఆత్మని ఒక బాటిల్ లో పెట్టి ప్రీ-లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ చేశాడు. డిఫరెంట్ చిత్రాలని చూసే ప్రేక్షకులని ఆ పోస్టర్ చాలా ఆకట్టుకుంది.

దాదాపు ఆరు నెలల తర్వాత రవిబాబు ఇప్పుడు ఆవిరి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశాడు. ఒక ప్రెజర్ కుక్కర్ లో అమ్మాయి కళ్లని పెట్టి రవిబాబు స్టైల్ లోనే డిజైన్ చేసిన పోస్టర్ బాగుంది. పోస్టర్ చూడడానికి ఆసక్తిగా ఉంది, రవిబాబు మేకింగ్ ఎలాగూ బాగానే ఉంటుంది కాబట్టి బిజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆవిరి సినిమాతో టై అప్ అవ్వడానికి రెడీ అయ్యారు. అక్టోబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.