Hyderabad: క‌బుర్లు ఆపి ముందు హెల్మెట్ పెట్టుకో బ‌స్తీబాల‌రాజు: సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్

Hyderabad: ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్ల్‌గా న‌టించిన తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా.. ఈ చిత్రం నేడు విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. దీంట్లో కార్తీకేయ స్వ‌ర్గ‌పురి వాహ‌నం(శవాల‌ను శ్మశా‌నంకు తీసుకెళ్లే వాహ‌నం) డ్రైవ‌ర్‌గా బ‌స్తీ బాలరాజు న‌ట‌న ఎంతో అల‌రిస్తోంది. అలాగే మ‌ల్లిక అనే విడోగా న‌టించిన హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి న‌ట‌న కూడా న్యాచుర‌ల్‌గా ఉంద‌ని ప్రేక్ష‌కులు కితాబిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఒక సీన్‌లో బ‌స్తీ బాల‌రాజు బైక్‌పై మ‌ల్లిక‌‌ను వెనుక కూర్చొపెట్టుకున్నాడు.. కానీ మ‌న బ‌స్తీ బాల‌రాజు హెల్మెట్ పెట్టుకోకుండా స్టైల్‌గా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని డ్రైవ్ చేస్తుంటాడు..

Kaarthikeya

అయితే దీనికి సంబంధించిన ఫోటోల‌ను ఉప‌యోగించుకుని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా.. హెల్మెట్ల్ పెట్టుకుని స‌రిగ్గా న‌డిపితే ఎలాంటి క‌బుర్లు వినాల్సిన ప‌ని లేదు బ‌స్తీ బాల‌రాజు గారు అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. వాహాన‌దారులను చైత‌న్య వంతం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.‌‌