కౌంట్‌డౌన్‌: 200 రోజుల్లో  ప్ర‌పంచ‌వ్యాప్తంగా పుష్ప రూల్స్ బిగిన్ – ఆగస్టు 15న  రిలీజ్


సుకుమార్ రైటింగ్స్ అసోసియేష‌న్‌తో  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – జీనియస్   డైరెక్టర్ సుకుమార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్  ఇటీవ‌ల ఈ చిత్రం విడుద‌ల తేదినీ ప్ర‌క‌టించి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్ అందించిన విష‌యం తెలిసిందే. అయితే మేక‌ర్స్ సోమ‌వారం మ‌రో ఇంట్రెస్టింప్ అప్‌డేట్‌ను ఇచ్చారు. మ‌రో రెండొంద‌ల రోజుల్లో పుప్ప రూల్ బిగిన్ కాబోతుంద‌ని, విడుద‌ల తేదీని మ‌రోసారి క‌న్‌ఫ‌ర్మ్ చేస్తూ
 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పుష్ప‌-2 శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి.

నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు