‘హ్యాపీ ఎండింగ్’ సినిమా గురించి నిర్మాత అనిల్ పల్లాల

యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత అనిల్ పల్లాల.

– సిల్లీ మాంక్స్ అనేది కంటెంట్ క్రియేటింగ్ కంపెనీ. మేము 24 కిస్సెస్ సినిమా ద్వారా ప్రొడక్షన్ లోకి వచ్చాము. ఆ సినిమా యూత్ ఫుల్ మూవీ అయినా మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే హ్యాపీ ఎండింగ్ సినిమాలోనూ యూత్ నచ్చేలా ఉంటూనే మెసేజ్ ఓరియెంటెడ్ గా నిర్మించాం. మిగతా ఇండస్ట్రీస్ లా సినిమా పరిశ్రమ ఒక ఇండస్ట్రీగా బయట ఇన్వెస్టర్స్ గుర్తించడం లేదు. మనం ఫిలిం ఇండస్ట్రీ అని పిలుచుకుంటాం. ఇక్కడ ఏటా 600 సినిమాలు రిజిస్టర్ అయితే మనకు 150 సినిమాలు మాత్రమే తెలుస్తుంటాయి. మిగతా 450 సినిమాలు ఏమవుతున్నాయనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాలన్నీ మేకింగ్ మీద అవగాహన లేకుండా థర్డ్ పర్సన్స్ ను నమ్మి నిర్మిస్తున్నారు. ఒక కొత్త హీరోపై కోటి రూపాయల్లో తీద్దామనుకునే సినిమా మూడు కోట్ల రూపాయల దాకా బడ్జెట్ వెళ్తోంది. దీని వల్ల ఆ సినిమా సక్సెస్ అయినా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా ఏటా 400 నుంచి 500 కోట్ల రూపాయలు కొత్త ప్రొడ్యూసర్స్ ఇక్కడ అవగాహన లేని కారణంగా నష్టపోతున్నారు. మా సంస్థ ఇలాంటి ప్రొడ్యూసర్స్ కు ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు ఒక బ్రిడ్జిలా ఉండేలా పనిచేస్తున్నాం. మేము నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంటాము. అక్కడ సినిమాలను గమనిస్తుంటాం. మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ ఎలా చేస్తున్నారనే అంశాలపై స్టడీ చేశాం. సినిమాలకు ప్రమోషన్ యాక్టివిటస్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మా వింతగాథ వినుమా, జార్జిరెడ్డి సినిమాలు చేశాం. ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ మూవీ ప్రాజెక్ట్ సెట్ చేసి అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చేశాం. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండదని మాకు అవగాహన ఉంది. కొత్త హీరో కాబట్టి రిలీజ్ తర్వాత మూవీకి వచ్చే రెస్పాన్స్ ను బట్టి బిజినెస్ చేయాలనుకున్నాం. 24 కిస్సెస్ సినిమాకు థియేట్రికల్ గా మాకు పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మేము ఇతర భాషల్లో డబ్ చేస్తే అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాకు ఒకే రకమైన ఆదాయం ఉండదు. ఒక్కో సినిమాకు ఒక్కోలా ప్రొడ్యూసర్స్ సేఫ్ అయ్యేలా ప్లాన్ చేయాలి.

– ఒక సినిమాకు కథే ఇంపార్టెంట్. మేకింగ్ వైజ్ ఇతర అంశాలు ఎలా ఉన్నా…కథ బలంగా ఉంటే ముందుకు వెళ్లొచ్చు. హ్యాపీ ఎండింగ్ మూవీ కథలో పొటెన్షియాలిటీ ఉంది. ఆ కథ మీద నమ్మకం పెట్టుకున్నాం. కొంత ఖర్చు అటూ ఇటూ అయినా రిస్క్ చేశాం. కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాం. ఒక వర్త్ ఫుల్ సినిమా చేశామని అనుకుంటున్నాం. మా సినిమాలో ఏముందో అదే ప్రమోషన్ లో ఆడియెన్స్ కు రివీల్ చేస్తున్నాం. సినిమాలో లేనివి ప్రమోషన్ కంటెంట్ లో చూపించి ఆడియెన్స్ ను తప్పుదోవ పట్టించడం లేదు. వికీ డోనర్, ఓ మై గాడ్ 2 సినిమాల్లో మనం ఇబ్బంది అనుకునే అంశాన్ని ప్రధానంగా చూపించినా…కథలో అనేక ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. హ్యాపీ ఎండింగ్ కథలోనూ అలాంటి లేయర్స్, ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పటితరం ఆడియెన్స్ కు అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉంది. వాళ్లు కొత్త ట్రెండ్ ను స్వీకరించడానికి రెడీగా ఉంటున్నారు. హ్యాపీ ఎండింగ్ మూవీ చూస్తే మీరు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక ఆలోచనలో పడతారు.

– మన దగ్గర హీరో డేట్స్ దొరికితే చాలు సినిమా బిగిన్ చేస్తున్నారు. వాళ్లు సెలెక్ట్ చేసుకున్న కథలకు ప్రీ ప్రొడక్షన్ జరగడం లేదు. ప్రీ ప్రొడక్షన్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలో ఫెయిల్ అయ్యాయి. కానీ ప్రీ ప్రొడక్షన్ ఎంత బాగా చేస్తే సినిమా బడ్జెట్ అంత కలిసొస్తుంది. దాదాపు టీమ్ అంతా కొత్త వాళ్లే కాబట్టి మేము హ్యాపీ ఎండింగ్ మూవీకి దాదాపు 9 నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ చేశాం. ప్రతి సీన్ మీద వర్కవుట్ చేశాం. బాగా ప్రిపేర్ అయ్యాం కాబట్టే కేవలం 30 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగలిగాం.

– యష్ థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కాబట్టి బాగా పర్ ఫార్మ్ చేశాడు. తన క్యారెక్టర్ లోని ప్రతి ఎమోషన్ చూపించాడు. ఒక హీరో పర్ ఫార్మర్ అయితే అతనికి తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. యష్ కూడా అలాగే ఎదుగుతాడు. హీరోయిన్ అపూర్వ కూడా థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్టే. ఆమె పర్ ఫార్మెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. డెడికేషన్ ఉన్న టీమ్ దొరికింది కాబట్టే మా సినిమా షూటింగ్ చాలా స్మూత్ గా జరిగింది. మా సినిమా మీద రెండేళ్లుగా జర్నీ చేస్తున్నాం. అయినా ఇంకా అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాం. సినిమా బాగుంటుందని నమ్ముతున్నాం. హ్యాపీ ఎండింగ్ సినిమా టెక్నికల్ గా అన్ని క్రాఫ్ట్స్ లో ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ ఇంప్రెస్ చేస్తుంది. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు స్మైల్ తో వస్తారు. మీ టైమ్ వృథా కాలేదని అనుకుంటారు. మా మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా యంగ్ టాలెంట్స్ కాబట్టి మీ ఎంకరేజ్ మెంట్ కావాలి. ఏషియన్ వాళ్ల ద్వారా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం.

– మా సంస్థ నుంచి ఓటీటీ తీసుకొచ్చే ఆలోచన ఇప్పుడు లేదు. రైటర్స్ టీమ్ ఉంది. వారితో మంచి స్క్రిప్ట్స్ చేసి అది సంతృప్తిగా ఉంటేనే కంటెంట్ మేకింగ్ కు వెళ్తుంటాం. సినిమాల్లోనూ అదే ఫాలో అవుతున్నాం. వేరే ప్రొడక్షన్ కంపెనీస్ తో టైఅప్ అవుతున్నాం. కొత్త హీరోతో ఓ స్మాల్ బడ్జెట్ మూవీ చేస్తున్నాం. అదిప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఆ డీటెయిల్స్ త్వరలో చెబుతాం.

తారాగణం – అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనితా చౌదరి, హర్ష్ రోషన్, జియా శర్మ, వంశీ నెక్కంటి, KMM మణి, కమల్ తుము, శ్వేత తదితరులు.

సాంకేతిక బృందం:

సంగీతం – రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి
ఎడిటర్ – ప్రదీప్ ఆర్ మోరం
స్క్రీన్ ప్లే – నాగసాయి
నిర్మాతలు – యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
కథ & దర్శకత్వం – కౌశిక్ భీమిడి
PRO – GSK మీడియా