ఈ డ్రగ్స్ కేసు వెనుక ఉన్న టాలీవుడ్ హీరో అతడేనా ?


హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియు రాలిగా తెలిసింది. ఆ టాలీవుడ్ హీరో ఎవరు అన్నది తెలియవలసి ఉంది.

లావణ్య అనే మహిళగోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

దీంతో ఆమెపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇప్పటికే మోకిలా పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా గుర్తించారు.

సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యను రిమాండ్‌కు తరలించారు.