Tollywood: ఎస్పీబాలు, గాయ‌ని చిత్ర ప‌ద్మ అవార్డ్స్‌పై తెలుగు చ‌ల‌న‌ చిత్ర నిర్మాత మండ‌లి అభినంద‌న‌లు..

Tollywood: గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంను ప‌ద్మ‌విభూష‌ణ్‌తో భార‌త ప్ర‌భుత్వం గౌర‌వించింది. మ‌ర‌ణానంత‌రం ఈ అవార్డును ప్ర‌కటించింది. 2021 సంవ‌త్స‌రానికి గాను గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారు ఇప్ప‌టికే ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుల‌ను అందుకున్నారు. ఇప్పుడు రెండో అత్యుత్త‌మ పౌర పుర‌స్కారం అయిన ప‌ద్మ‌విభూష‌ణ్ ఆయ‌న్ని వ‌రించింది.

Padma awards

Tollywood దీంతో ఆయ‌న మూడు ప‌ద్మ అవార్డుల‌ను అందుకున్నారు. ఎస్‌పి బాలు ఉత్త‌మ గాయ‌కుడిగా ఆరుసార్లు జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల‌ను గెలుచుకున్నారు. అలాగే 25నంది అవార్డ్స్ ఆయ‌న‌కు వ‌రించ‌గా.. 16భాష‌ల్లో 40వేల‌కు పైగా పాట‌లు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ద‌క్షిణాదిలో గొప్ప గాయ‌కుడిగా అంద‌రి మ‌న‌సుల్లో స్థానం పొందిన ఎస్పీ బాలుగారు గ‌తేడాది సెప్టెంబ‌ర్ 25న క‌న్నుమూశారు. Tollywood ఇక అలాగే ప్ర‌ముఖ గాయ‌నీ చిత్ర గారు 2005లో ప‌ద్మ‌శ్రీ అందుకున్నారు. మ‌ళ్లీ 16ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు, సినీ ప్రేక్ష‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాగా ఇప్పుడు తాజాగా మా కౌన్సిల్‌, Tollywood తెలుగు సినీ మ్యూజిషియ‌న్స్ యూనియ‌న్ త‌ర‌పున శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. లెజెండరీ సింగర్ దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారికి “పద్మ విభూషణ్” అలాగే శ్రీమతి కె.ఎస్ చిత్ర‌గారికి “పద్మ భూషణ్” అని భారత ప్రభుత్వం ప్రకటించినందుకు వారు సంతోషం వ్య‌క్తం చేశారు. అలాగే దివంగత శ్రీ ఎస్.పి.బాలాసుబ్రమణ్యం గారి కుటుంబ సభ్యులకు, సంగీత రంగానికి ఎంతో కృషి చేసిన చిత్ర గారికి ప‌ద్మఅవార్డ్స్‌పై ఈ సందర్భంగా, Tollywood తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.