CM KCR: సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్భంగా బంధూక్ ల‌క్ష్మణ్ ప్ర‌యోగం..

CM KCR: బంధూక్‌ చిత్రంతో క్రిటికల్ గా మన్నలను పొందిన దర్శకులు లక్ష్మణ్ మురారి, కెసిఆర్ గారి 67వ పుట్టిన రోజును పురస్కరించుకుని కేసీఆర్‌ నువ్వే ఒక చరిత్ర అనే డాక్యుమెంటరి సినిమాను విడుదలచేస్తున్నారు. తెలంగాణ బ్రీత్ లేస్ సాంగ్, 18 మంది మేటి గాయకులతో వీరాది వీరుడు పాట, ఇలా ఎప్పుడు ప్రయోగాలను ఛాలెంజ్ గా తీసుకునే దర్శకులు లక్ష్మన్, ఈ కేసీఆర్‌ నువ్వే ఒక చరిత్ర అనే సినిమాలో 1964-68 దశకం నాటి CM KCRకెసిఆర్ గారు చదివిన దుబ్బాక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను 3D విజువల్ ఎఫెక్ట్స్ లో రి క్రియేట్ చేసారు. స్కూల్ లో చదువుతున్నప్పుడు కెసిఆర్ గారు పాడిన పాటను అచ్చం అప్పుడు 1964 పాడినట్లుగా, బహుమతి గెలుచుకున్న బాలుడు కేసిఆర్ గారిని 3D విజువల్ ఎఫెక్ట్స్, Motion Capture Technology తో చిత్రీకరించారు.

CM Kcr

CM KCRకేసిఆర్ గారు స్కూల్ చదివేటప్పుడు భీష్మ ద్రోణ కృపాధి దన్వి నికారచలంబు అనే కటిన మైన మహా భారతం లోని పధ్యాలు పాడి బహుమతులు గెలుచుకున్న విషయం విదితమే.. చాలా రోజులుగా దుబ్బాక చింతమడక, దుబ్బాక గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రస్తుత పరిస్థితులను, చూసి 60 ఏళ్ల క్రింతం ఎలా వుండేదో ఊహించుకొని, 3D ఆర్ట్స్ లో చిత్రాలు గీహించి, గ్రాఫికల్ వర్క్ నీ పూర్తి చేశారు. CM KCRకెసిఆర్ గారి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి ఫలితాలు, విజయాలు, ప్రస్తుత అభివృద్ధికి కారణమైన కెసిఆర్ గారి మనో గతాన్ని వివరించారు. ఇందులో 2 బిట్ సాంగ్స్ కూడా వున్నాయి. ఇక CM KCRఈ డాక్యుమెంట‌రీని కాక‌తీయ ఇన్నోవేటివ్స్ ప్రొడక్ష‌న్స్ నిర్మిస్తున్నారు.