తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో ‘కాతువక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. ఇందులో హీరోయిన్స్‌గా సమంత, నయనతారను మేకర్స్ ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్లో నయనతార, సమంత మధ్య గొడవలు జరిగాయని, అందుకే ఈ సినిమా నుంచి సమంత తప్పుకుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. విఘ్నేష్ కూడా నయనతారకు సపోర్ట్ చేశాడట. దీంతో సమంత కోపంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
దీంతో సమంత స్థానంలో మరో హీరోయిన్ని తీసుకునేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవమని తాజాగా తేలింది. లాక్డౌన్ తర్వాత తాజాగా ‘కాతువక్కుల రెండు కాదల్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రేక్షకులతో విఘ్నేష్ పంచుకున్నాడు. ఈ సందర్భంగా సమంత, నయనతారను ట్యాగ్ చేశాడు.
దీనిని బట్టి చూస్తుంటే ఈ సినిమా నుంచి సమంత తప్పుకోలేదని అర్థమవుతోంది. రొమాంటిక్ సినిమాగా ఇది తెరకెక్కుతుండగా.. లలితా కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.