Cheating Case Sunnyleion: బాలీవుడ్ నటి సన్నీలియోన్‌పై చీటింగ్ కేసు నమోదు అయింది. 2019లో కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక వేలంటైన్స్‌డే ఫంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చేందుకు తమ దగ్గర సన్నీలియోన్ రూ.29 లక్షలు తీసుకుందని, కానీ డబ్బులు తీసుకుని కూడా రాలేదని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన కేరళ పోలీసులు.. సన్నీలియోన్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన కొచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. సన్నీలియోన్ వాంగ్మూలం తీసుకుంది. కానీ సన్నీలియోన్ మాత్రం తాను ఎవరినీ మోసం చేయలేదని పోలీసులకు తెలిపింది. తాను రెండుసార్లు కొచ్చి వచ్చి వెళ్లానని, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కార్యక్రమాన్ని నిర్వహించలేదని చెప్పింది. తనకే ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉందని సన్నీలియోన్ తెలిపింది. సన్నీలియోన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.. దీనిపై తదుపరి విచారణ చేపడుతున్నారు.