Kajal: కాజల్ అగ‌ర్వాల్ పేరు మార్చుకుంది..

Kajal: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ అంటేనే ప్రేక్ష‌కులు ఎంతో అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించి త‌న అందంతో పాటు త‌న ప్ర‌తిభ‌తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. ఇక Kajal కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరుతో తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది. కాగా గ‌తేడాది‌లో వ్యాపార‌వేత్త గౌత‌మ్‌కిచ్లుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

kajal aggerwal

అయితే వివాహం అయినా త‌ర్వాత త‌న పేరును మార్చుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. త‌న భ‌ర్త పేరు క‌లిసి వ‌చ్చేలా Kajal కాజ‌ల్ ఎ కిచ్లు అని మార్చుకుంది. త‌న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మార్పులు చేసింది. ఇదిలా ఉంచితే, కాజ‌ల్ ఎ కిచ్లు ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్యలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌- శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఇండియ‌న్‌-2 చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు ఇటీవ‌లే తెర‌కెక్కిన‌ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరిస్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో Kajal పోషించగా.. ఈ వెబ్‌సిరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది.