తెలుగు దేశం పార్టీ అధినేత శ్రీ చంద్ర బాబు నాయుడు గారు ఎన్డీయే సమావేశంలో ఎన్నో విషయాలు మాట్లాడారు. వాటిలో ముఖ్యంగా ప్రధాని మోదీ ని ఉద్దేశిస్తూ దేశానికీ అటువంటి నాయకుడు సరైన వారు అన్నారు. ఆనయ పరియాలనలో గ్లోబల్ పవర్ హబ్ గా దేశం మారబోతుంది అన్నారు. అలాగే మోదీ ఎన్డీయే కూటమి రావడం కోసం ఎంతో కష్టపడ్డారు అని చెప్పాడు. మోదీ వికసిత్ భారత్, సబ్‌కా వికాస్, సబ్‌కా తేజ్ అనే నినాదాలతో అందరు కలిసి ముందుకు వెళ్ళాలి అని అన్నారు.
అలాగే తమ పార్టీ వ్యవస్స్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ గారి మార్గంలోనే వెళ్తామంటూ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు. మానవత్వం అన్నిటికంటే గొప్పది, దానికే కట్టుబడి ఉంటాం అని చంద్ర బాబు అన్నారు. అలాఇ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ ఎన్డీయే కూటమికి పవన్ కళ్యాణ్ ఎంతో ముఖ్య పాత్రా వహించారు అంటూ ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. అంతే కాకుండా కూటమికి పురందేశ్వరి గారు బాగా సహకరించడం వల్లనే 90 శాతం సీట్లు గెలుచుకున్నాం అన్నారు.