చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ‘కల్కి 2898AD’ ట్రైలర్?

ప్రభాస్ హీరో గా నటిస్తూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న సినిమా ‘కల్కి 2898AD’. వైజయంతి బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దుత్త నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయినా ఈ ఛుత్ర టీజర్, బుజ్జి & భైరవ పరిచయం, అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్న అనిమేషన్ వెర్షన్ 2 ఎపిసోడ్ లు ఇప్పటికే ప్రేక్షకులలో ఎంతో బజ్ తెప్పించారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే 2024 ఎన్నికలలో గెలిచినా NDA అభ్యర్థి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఎంత వరుకు నిజం అనేది వేచి చూడాలి.