చాణక్య కథ అతనిదేనా?

పంతం సినిమాతో 25 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చాణక్య, తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండో పాకిస్థాన్ బార్డర్ లో షూటింగ్ జరుపుకుంది. ఫస్ట్ లుక్ నుంచే గోపీచంద్ చాణక్య సినిమాతో హిట్ అందుకుంటాడు అనే నమ్మకం కలిగించిన చిత్ర యూనిట్, రీసెంట్ గా చాణక్య టీజర్ ని రిలీజ్ చేశారు. ఇండియన్ రా ఏజెంట్ పాకిస్థాన్ వెళ్లి అక్కడ మన దేశం పోరాడితే ఎలా ఉంటుంది? అతనితో మన దేశానికి సంబంధాలు తెగిపోతే ఆ ఏజెంట్ పరిస్థితి ఏంటి అనే కథతో చాణక్య తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్ లో గోపీచంద్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేసిన గోపీచంద్, పాకిస్థాన్ లో ఉండే రా ఏజెంట్ లుక్ లో కొత్తగా ఉన్నాడు. అయితే టీజర్ చూస్తుంటే, చాణక్య సినిమాని ఎక్స్ రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ కథతో తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. విజువల్స్ చూస్తే సల్మాన్ ఖాన్ హిట్ ఫిల్మ్ ఏక్ థా టైగర్ కనిపిస్తోంది. ఈ రెండు విషయాలని కలిపి ఏక్ థా టైగర్ రేంజులో రవీంద్ర కౌశిక్ కథని రూపొందించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. 58 సెకండ్స్ డ్యూరేషన్ తో వచ్చిన చాణక్య టీజర్ లోని బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, గ్లిమ్ప్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సో గోపీచంద్ కెరీర్ లో చాణక్య ఈజ్ డెఫినెట్లీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక చాణక్య టీజర్ చూసిన వాళ్లు మాత్రం, ఈ మూవీని గోపీచంద్ హిట్ మూవీ అయిన సాహసం సినిమాతో పోలుస్తున్నారు. సాహసం సినిమాలో ఇండో పాక్ ఇష్యూ ఉంటుంది, గోపీచంద్ తాత ఆస్థిని తెచ్చుకోవడానికి పాకిస్థాన్ వెళ్తాడు. దాదాపు చాణక్య సినిమాలో లుక్ లోనే సాహసం సినిమాలో కనిపించిన గోపీచంద్, పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ ఫైట్ చేసి అతని తెలివితో నిధికి సంబందించిన లాక్స్ ఓపెన్ చేసి తనకి రావాల్సిన వాటిని తెచ్చుకుంటాడు. చంద్ర శేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా డిఫరెంట్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని అలరించింది. సాహసం సినిమా తర్వాత ఇప్పుడు గోపీచంద్ మళ్లీ చాణక్య సినిమాతో పాకిస్థాన్ వెళ్లనుండడంతో, ఆ ఇండో పాక్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయితే గోపీచంద్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమని అనుకుంటున్నారు. సాహసం, చాణక్య రెండు సినిమాల కథలు వేరు అయినా… కథనం దాదాపు ఇండియాలో మొదలైన హీరో ప్రయాణం పాకిస్థాన్ కి వెళ్లి, అక్కడ ఫైట్ చేసిన తిరిగి ఇండియా రావడం మాత్రం ఒకటేలా ఉంటుంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చాణక్య సినిమా గోపీచంద్ కి కమర్షియల్ సక్సస్ అందిస్తుందేమో చూడాలి.