వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇక నుంచి ఎలా పడితే అలా యూట్యూబ్ ఛానెళ్లు క్రియేట్ చేయడానికి వీల్లేదు. యూట్యూబ్ ఛానెల్స్, ఓటీటీలు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిని కేంద్ర సమాచారశాఖ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. కొంతమంది వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నారు.
దీంతో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు కూడా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఉపయోగపడనుంది.