నాకు ఆ హీరో అంటే అసలు ఇష్టముండదు: త్రిష

తెలుగుతో పాటు తమిళ సినిమాలతో హీరోయిన్‌గా స్టార్ డమ్‌ను అందుకుంది త్రిష. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన త్రిష.. కోలీవుడ్‌లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

trisha

తనకు హీరో విజయ్ అంటే అసలు ఇష్టముండదని త్రిష బయటపెట్టింది. అజిత్ అంటే తనకు చాలా ఇష్టమంది. విజయ్, త్రిష మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ క్రమంలో విజయ్ అంటే తనకు అసలు ఇష్టముండదని, ఎప్పటికీ ఇష్టపడనంటూ త్రిష్ చేసిన వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

విజయ్‌తో కలిసి త్రిష చాలా సినిమాల్లో నటించింది. విజయ్‌తో కలిసి ఆమె నటించిన చాలా సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి.