సత్యదేవ్ మూవీ ‘కృష్ణమ్మ’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ రిలీజ్

సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 3న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.. అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ‘దుర్మమ్మ..’ అనే సెలబ్రేషన్ సాంగ్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. కాలభైరవ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా సాకేత్ కొమండూరి పాడారు. నవరాత్రుల సమయంలో దుర్గమ్మ ముందు హీరో సంతోషంగా ఆడిపాడే సందర్భంలో ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.

నటీనటులు:

సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ –  కొరటాల శివ
బ్యానర్ – అరుణాచల క్రియేషన్స్
నిర్మాత – కృష్ణ కొమ్మలపాటి
రచన, దర్శకత్వం – వి.వి.గోపాలకృష్ణ
సంగీతం – కాల భైరవ
సినిమాటోగ్రఫీ – సన్నీ కూరపాటి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ – రామ్ కుమార్
పాటలు – అనంత శ్రీరాం
ఫైట్స్ – పృథ్వీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవి సూర్నెడ్డి
పి.ఆర్.ఒ – వంశీ కాకా