ప్రభాస్‌తో కలిసి నటించే బంపర్ ఆఫర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్‌తో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్ షూటింగ్ ప్రారంభమవ్వగా.. ఇందులో నటించడానికి నటుల కోసం కాస్టింగ్ కాల్ నిర్వహించారు. దీంతో చాలామంది ఆడిషన్స్‌లో పాల్గొనగా.. కొంతమంది ప్రభాస్ సలార్ సినిమాలో అవకాశం దక్కింది. అయితే ప్రభాస్ నటించనున్న మరో సినిమాకి సంబంధించిన కాస్టింగ్ కాల్ వచ్చింది.

prabhas and nag aswin movie

త్వరలో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. ఇందులో నటుల కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. ఈ మేరకు వైజయంతి మూవీస్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. 9 నుంచి 14 సంవ‌త్స‌రాల అమ్మాయిల‌‌కు డ్యాన్స్‌ల‌తో పాటు జిమ్మాస్టిక్స్ కూడా తెలిసి ఉండాల‌ని కాస్టింగ్ కాల్ ఇచ్చారు. అలాగే 20-35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పురుషుల‌కు డ్యాన్సింగ్‌, మార్ష‌ల్స్ ఆర్ట్స్‌పై ప‌ట్టు ఉండాల‌ని పేర్కొన్నారు. VYMTALENT@GMAIL.COMకు మీ వీడియోలు పంపించాలని కోరారు.