Kajal: ఆ వ్యాధితో ఇబ్బందిప‌డుతున్న కాజ‌ల్‌‌.. ఈ విష‌య‌మంద‌రికీ తెలిసేలా ప్ర‌య‌త్నిద్దాం అంటూ ట్వీట్‌!

Kajal: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాజ‌ల్ అందానికి కుర్ర‌కారు ఆమెకు దాసోహం అవుతారు. అలాగే అందంతో పాటు ఎంతో ఫిట్‌గా క‌నిపిస్తుంది కాజ‌ల్‌.. దీంతో పాటు ప్ర‌తిభ కూడా ఉండ‌డంతో, ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది Kajal కాజల్‌. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కాజ‌ల్‌ గౌత‌మ్ కిచ్లును వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతోKajal కాజ‌ల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మ‌రో వైపు తాను న‌టించాల్సిన‌ సినిమాలు చేస్తూ.. బిజీగా గ‌డుపుతుంది కాజ‌ల్‌.

kajal

అయితే ఫిట్‌నెస్‌ అందంతో పిచ్చేక్కించేలా కాజ‌ల్‌కు ఓ వ్యాధి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంద‌ట‌.. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కాజల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలుపుతూ.. త‌న‌కు బ్రాంకియ‌ల్ ఆస్త‌మా వున్న‌ట్లు తెలిపింది. ఈ వ్యాధి Kajal 5ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌పుడు తెలిసింద‌ని.. పాలు, చాక్లెట్లు తినాల్సిన వ‌య‌సులో.. ఆహారం విష‌యంలో ఆంక్ష‌లు విధించ‌డం త‌న‌కింకా గుర్తు ఉంద‌ని అన్నారు. ఇక చ‌లికాలం వ‌స్తే ఈ వ్యాధి మ‌రింత రెట్టింపు అవుతుంద‌ని, అప్పుడు త‌న పరిస్థితి దారుణంగా ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఎందుకంటే చ‌లికాలంలో దుమ్ము ధూళిలోకి వెళ్తే తీవ్ర ఇబ్బందులు ప‌డేదాన్ని, ఈ బ్రాంకియ‌ల్ ఆస్త‌మా ల‌క్ష‌ణాలు మ‌రింత పెరిగేవి. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి Kajal తాను ఇన్ హేల‌ర్ ఉప‌యోగిస్తాన‌ని.. అది వాడ‌డం వ‌ల్ల వెంట‌నే మార్పు క‌నిపించేదని, కాబ‌ట్టి నేను ఎక్క‌డికి వెళ్లిన నా వెంట ఇన్ హేల‌ర్ త‌ప్ప‌కుండా ఉండేలా చూసుకుంటా అని తెలిపింది కాజ‌ల్. అయితే ఇన్ హేల‌ర్ విష‌యంలో ఇత‌రులు ఎలా భావిస్తారో అని తెలిపింది Kajal కాజ‌ల్‌.. మ‌న దేశంలో చాలా మందికి ఇన్ హేల‌ర్ అవ‌స‌రం. కానీ అంద‌రూ ఏమ‌నుకుంటారో అని దాన్నీ త‌మ వెంట ఉంచుకోరు. ఇన్ హేల‌ర్ ఉప‌యోగించ‌డానికి సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అది ప‌బ్లిక్‌గా అయినా, ప్రైవేట్‌గా నైనా ప‌ర్వాలేదు. కాబ‌ట్టి ఈ విషయాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తెలియ‌జేయ‌డానికి ప్ర‌య‌త్నిద్దాం. సే ఎస్ టు ఇన్ హేల‌ర్స్ అంటూ Kajal కాజ‌ల్ తెలిపింది. ఇదిలా ఉంచితే.. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుంది. త‌మిళ్‌లో క‌మ‌ల్‌హాస‌న్ ఇండియ‌న్‌-2లో చేస్తుంది ఈ భామ‌.. ఇక ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైన లైవ్ టెలికాస్ట్ వెబ్‌సిరీస్ Kajal కాజ‌ల్ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.