ఈసారి మల్టీలింగ్వల్ ప్లాన్ చేసిన కాష్ అనుదీప్

జాతి రత్నాలు సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్. తన కామెడి టైమింగ్ తో కాష్ అనుదీప్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాకి సీక్వెల్ చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి అనుష్కతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. నవీన్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే లోపు అనుదీప్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్న ఈ మూవీతో హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ లోకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శివ కార్తికేయన్‌కి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది, రేమో మూవీ తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. ఫన్ ఉండే సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేసే శివ కార్తికేయన్ అనుదీప్ తో కంప్లీట్ ఫన్ రైడ్ లాంటి సినిమా చేయడానికి ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి అనుదీప్ ఈ హీరోకి టాలీవుడ్‌ లో ఎలాంటి హిట్ ఇస్తాడు? ఈ సినిమాను నిర్మించే వారెవరో త్వరలో వెల్లడికానుంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెట్టారు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయడానికి స్కెచ్ వేసుకుంటున్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతుంటే కోలీవుడ్ హీరోలు ఇక్కడ ఫోకస్ చేశారు. ఇప్పటికే యంగ్ హీరో ధనుష్, విజయ్ ఇక్కడ స్ట్రైట్ సినిమాలను కమిటయ్యారు. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కోలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.