చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ చూసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన టీం. ఇండియాని ముందుండి నడిపించిన ధోనినే ఈ టీంని కూడా నడిపిస్తున్నాడు. 10 సీజన్స్, 10 ప్లే ఆఫ్స్, 3సార్లు టైటిల్ విన్నర్… ఆడిన 160 మ్యాచుల్లో 73% గెలిచిన ఏకైక టీం. ఇలాంటి టీంతో ఆడాలి అంటే ఏ జట్టుకైనా వణుకు పుట్టాల్సిందే, కానీ ఒక్క టీంకి మాత్రం కాదు. చెన్నై సూపర్ కింగ్స్ కే దడ పుట్టిస్తున్న ఆ ఒక్క టీం ముంబై ఇండియన్స్. ఇండియా టీం స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ఈ టీం, చెన్నైని ఆపడంలో కంప్లీట్ గా సక్సస్ అయ్యింది. ముఖ్యంగా ధోని స్ట్రాటజీస్ కి రోహిత్ తన హార్డ్ హిట్టింగ్ టీంతో చెక్ పెట్టాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాకిస్థాన్ ఇండియా, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీంలు ఆడుతుంటే ఎంత క్యూరియాసిటీ ఉంటుందో చెన్నై ముంబై టీమ్స్ తలపడిన ప్రతిసారి అంటే ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ రెండు టీమ్స్ 28 మ్యాచులు ఆడితే అందులో ముంబై 17 మ్యాచ్స్ గెలిచింది అంటే చెన్నైపైన ముంబైకి ఎంత క్లీన్ రికార్డు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ఐపీఎల్ లో మెరుపులు మెరిపించాలని చూస్తుంటే, మొదటి మ్యాచ్ లోనే అతనికి అడ్డుకట్ట వేయాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు. నాలుగు సార్లు ఐపీఎల్ కప్ గెలిచిన టీంకి ధోనిని ఆపడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈరోజు జరగున్న మొదటి మ్యాచ్ లో గెలిచి ముంబై ఐపీఎల్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుంది.