కేరాఫ్ కంచరపాలెం… చిన్న బడ్జట్ లో, ఒరిజినల్ లొకేషన్స్ లో, నాచురల్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. న్యూ ఏజ్ సినిమాగా వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాని వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు. అంత లిమిటెడ్ బడ్జట్ లో క్వాలిటీ అండ్ కంటెంట్ రెండూ బాలన్స్ చేస్తూ కేరాఫ్ కంచరపాలెం సినిమాని తెరకెక్కించిన వెంకటేష్ మహాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంశలు దక్కాయి. ప్రేమలోని నాలుగు కోణాలను తొలి చిత్రంలో ఆవిష్కరించిన వెంకటేష్ మహా రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
మొదటి సినిమాకి మనిషిలోని ప్రేమని వేరు వేరు దశల్లో చూపించిన వెంకటేష్ మహా, ఇప్పుడు అదే మనిషిలోని ప్రతీకారాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా చేసిన ‘మహిషింటే ప్రతీకారం’ అంటే మహేశ్ ప్రతీకారం అని అర్ధం. 2016లో వచ్చిన ఈ సినిమా తెలుగులో రీమేక్ ని వెంకట్ మహా డైరెక్ట్ చేస్తున్న్నాడు. 45 కోట్లతో తెరకెక్కి 173 కోట్లు రాబట్టిన మహిషింటే ప్రతీకారం సినిమా తెలుగు వెర్షన్ లో ఫాహద్ ఫాజిల్ పాత్రలో సత్య దేవ్ నటించనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది.