ఫైనల్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్న కళ్యాణ్ రామ్…

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఎంత మంచి వాడవురా. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. రీసెంట్ గా టీజర్ తో మెప్పించిన చిత్ర యూనిట్, రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంత మంచి వాడవురా సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ మున్నార్‌లో చేయడానికి ప్లాన్ చేశారు. అక్టోబ‌ర్ 29 నుండి న‌వంబ‌ర్ 10వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ, రెండు పాట‌ల‌ను చిత్రీకరించ‌నున్నారు. ఇక్కడితో సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది.

kalyan ram

కళ్యాణ్ రామ్ పక్కన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా లిమిటెడ్‌ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త‌ నిర్మాత‌లు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఎంత మంచి వాడవురా సినిమాకి మహేశ్ సరిలేరు నీకెవ్వరూ, బన్నీ అల వైకుంఠపురములో సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఫ్యామిలీ సినిమా కావడం, సతీష్ వేగేశ్నకి శతమానం భావతితో వచ్చిన ఇమేజ్ ఎంత మంచి వాడవురా సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని వాడుకుంటూ కళ్యాణ్ రామ్ క్లీన్ హిట్ ఇస్తాడేమో చూడాలి.