మెగా హీరోతో బోయపాటి సినిమా ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణతో ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను BB3 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే ప్రకటించగా.. ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేస్తారనేది ఇప్పుడే ఫిక్స్ అయింది. బోయపాటి తన తర్వాతి సినిమాను సాయిధరమ్ తేజ్‌తో తీయనున్నాడని ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్‌లో తయారుచేసుకున్న ఒక కథను ఇటీవల సాయిధరమ్ తేజ్‌కి చెప్పగా.. ఇందులో నటించేందుకుక సాయితేజ్ కూడా ఒకే చెప్పాడట

BOYAPATI WITH SAIDHARAM TEJ

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందట. బాలయ్య సినిమా పూర్తైన వెంటనే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా అరుళ్ మోహన్‌ను తీసుకోనున్నారట. నకాగా ప్రస్తుతం దేవకట్ట డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు.