Bollywood: ఆటో డ్రైవ‌ర్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ..

Bollywood: దివంగ‌త ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ ధ‌డ‌క్ చిత్రంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. కానీ ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఆశించిన స్థాయిలో లేకున్నా.. జాన్వీ మంచి పేరే తెచ్చుకుంది. అందం, అలంక‌ర‌ణ విష‌యంలో జాన్వీ స్టార్ హీరోయిన్‌ల‌కు ఏమాత్రం తీసిపోదు. Bollywood అయితే సినిమాల విష‌యానికొస్తే.. ఈ అమ్మ‌డు సెలెక్ట్ చేసుకునే క‌థ‌లు మాత్రం చాలా వైవిధ్యంగానే ఉంటాయి.

jhanvi kapoor

గుంజ‌న్ స‌క్సేనా చిత్రంలో ఉమెన్ పైలాట్ పాత్రను పోషించ‌గా.. ఘోస్ట్ స్టోరీస్ వెబ్‌సిరీస్‌లో న‌ర్స్‌గా న‌టించింది. ఇక ఇప్ప‌డు ప్ర‌స్తుతం జాన్వీ.. గుడ్ ల‌క్ జెర్రీ అనే సినిమాతో బిజీగా ఉంది. Bollywood ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే ఆమె న‌టించిన దోస్తానా-2, రూహీ అఫ్ జానా చిత్రాలు ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. కాగా తాజాగా ఈ అమ్మ‌డు ఆటో డ్రైవ‌ర్‌గా మారింది. ఆటో న‌డుపుతూ.. జాన్వీ తీసుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. Bollywood ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.