Megastar: ఆచార్య కోసం తెలంగాణ మంత్రిని క‌లిసిన కొర‌టాల శివ..

Megastar: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ విష‌యంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను క‌లిశారు చిత్ర‌బృందం. అస‌లు విష‌యం ఏంటంటే.. Megastar ఈ చిత్రంలో చిరంజీవి- రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చే కీల‌క‌మైన‌ సీన్స్ కోసం బొగ్గు గ‌నుల పుట్టినిల్లు అయినా ఇల్లెందును సెల‌క్ట్ చేశాడు డైరెక్ట‌ర్ కొర‌టాల‌.

Acharya movie

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఉన్న ఈ కోల్‌మైన్స్‌లో షూటింగ్ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ అనుమ‌తుల కోసం తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను క‌లిశారు కొర‌టాల‌. దీంతో మంత్రి అక్క‌డ షూటింగ్ చేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇచ్చారు. అలాగే మెగాస్టార్Megastar చిరంజీవి కోసం అక్క‌డ వ‌స‌తి కూడా ఏర్పాటు చేస్తాం అని తెలిపిన‌ట్లు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ పేర్కొన్నారు. ఈ మ‌ధ్య‌నే మెగాస్టార్ చిరంజీవిని మంత్రి పువ్వాడ అజ‌య్ క‌లిసిన విష‌యం విధిత‌మే. ఇక ఈ చిత్రంలో Megastarచిరంజీవికి జోడీగా కాజ‌ల్ న‌టిస్తుండ‌గా.. రియ‌ల్ హీరో సోనూసూద్ ఇందులో విల‌న్‌పాత్ర‌ను పోషిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. మే 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అధికారిక‌రంగా ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం.