బిగ్ బాస్ 14 : ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి కంటెస్టెంట్స్!!

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్న బిగ్ బాస్ రియాలిటీ షో కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అక్టోబర్ లోనే షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కంటెస్టెంట్స్ ని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 20 నుండి గోరేగావ్ హోటల్‌లో క్వారంటైన్ లో ఉంటారని తెలుస్తోంది.

అక్టోబర్ 3 నుంచి షో టెలిక్యాస్ట్ కావచ్చు. బిగ్ బాస్ 14 తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంలో, ప్రొడక్షన్ హౌస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఛానెల్ ప్రదర్శనకు ముందు మరియు స్టార్ట్ అయిన సమయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్‌లను రూపొందించాయి. నిబంధనల ప్రకారం, పాల్గొనేవారు సెప్టెంబర్ 20 నుండి 10 రోజులకు పైగా గోరేగావ్ హోటల్‌లో నిర్బంధించబడతారు. ఇక 15మంది కంటెస్టెంట్స్ తో షో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షో మొదలవ్వడానికి ముంది రోజు కూడా ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.