డిఫరెంట్ కాన్సెప్ట్స్ చిత్రాలతో, వైర్సటైల్ పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేమైక ఇమేజ్ను సంపాదించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘స్టూవర్టుపురం దొంగ’. ‘బయోపిక్ ఆఫ్ టైగర్’ ట్యాగ్ లైన్. కె.ఎస్.దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే పొడవుగా వెనక్కి దువ్విన జుట్టు, గుబురు గడ్డంతో, రెండు తుపాకులను పట్టుకుని బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సీరియస్‌గా చూస్తున్న లుక్‌తో ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. హీరోయిజంతో పాటు ఎమోషన్స్, ఇన్టెన్స్ ఉన్న సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది.
1980 బ్యాక్‌డ్రాప్‌లో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పట్లో నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేయడమే కాదు..పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేవారు. అంతే కాకుండా ఉన్నవాడిని దోచి లేని వాడికి పంచేవారు. దాంతో ఆయన్ని అందరూ రాబిన్ హుడ్ అని టైగర్ నాగేశ్వరరావు అని పిలిచేవారు. ఓ పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో హార్డ్ వర్క్ చేసి తన లుక్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నారు. అన్నీ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు దర్శక నిర్మాతలు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్.