యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో స్పీడున్నోడు చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన రాక్షసుడు సినిమాతో శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా పలు చిత్రాల్లో నటించి అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
ఇప్పుడు ఈ యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఘనవిజయం సాధించిన ఛత్రపతి చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రమైన అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రామ్పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలపై కొంతమంది కుట్రపూరితమైన చర్యలు చేపడుతున్నారు. అల్లుడు అదుర్స్ సినిమాతో పాటు అదేరోజు విడుదలవుతున్న మరో సినిమా హీరో రామ్పోతినేని రెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని హీరో రామ్ పోతినేని పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నాడు. అయితే యంగ్ డైనమిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా.. రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాకు అడ్డుగా వస్తుందని కొంతమందిని ప్రభావితం చేసి అల్లుడు అదుర్స్ సినిమా రిలీజ్‌ను ఆపడానికి కుట్ర పన్నుతున్నారని అందిన సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా.. పలు ప్రముఖ ఛానెల్స్‌లో అల్లుడు అదుర్స్ సినిమాకు ఇబ్బంది కలిగించేలా కుట్ర పన్నుతున్నారు. ఈ విషయంపై ఇండస్ట్రీ వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రపంచంలోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. సెన్సెషన్ క్రియేట్ చేసిన తమిళ చిత్రం బిచ్చగాడు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకొచ్చినా సంచలన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారు.. ఆ కొన్ని ఛానెల్స్‌లో యాడ్స్ వేయకుండా బిచ్చగాడు చిత్రం ఎంతో సంచలన విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు. బిచ్చగాడు చిత్రం థియేటర్లో విడుదలైన సమయంలో పెద్ద స్టార్ల సినిమాలు, ఎంతో క్రేజీ క్రేజీ సినిమాలు వచ్చినా కూడా అవన్నీ ఒక్కొక్కటిగా వెళుతుండగా కూడా..బిచ్చగాడు చిత్రం 100రోజులకు పైగా విత్ అవుట్ డెఫిషిట్ షేర్ల మీద చాలా గొప్పగా ఆడిందని.. అలాగే ప్రేక్షక దేవుళ్ల దీవెనలు, ఆదరణలు ఉంటే ఎలాంటి సినిమా అయినా వాళ్లకి నచ్చినా సినిమాను సక్సెస్ బాటలో పయనిస్తూ నెత్తి మీద పెట్టుకుని పూజలు చేస్తారు. అలా కాకుండా మనం భారీ భారీ సినిమాలని చెప్పి తీసినా కూడా ప్రేక్షక దేవుళ్లకు నచ్చకపోతే ఆ భారీ సినిమాలు బోల్తా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అల్లుడు అదుర్స్ సినిమాపై ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ప్రేక్షకుల ఆశిస్సులు ఉంటే ఏ సినిమా అయినా విజయవంతమవుతుందని.. ప్రేక్షకుల ఆశీస్సులు, ఆదరణ లేకపోతే నా సినిమా హిట్ కావాలి.. నా సినిమా హిట్ కావాలి అని ఎంత ప్రమోషన్స్ చేసినా, కుట్రలు, కుతంత్రాలు పన్నినా అలాంటి వ్యక్తులు దిగజారుతారు తప్ప ప్రేక్షకుల మనస్సును మెప్పించలేరని ఇండస్ట్రీ వారు పేర్కొన్నారు. అదేవిధంగా.. పరిశ్రమల్లో ఉన్నవారందరూ తెలుగు పరిశ్రమను కాపాడుతూ..అందరికీ సహయం చేయాల్సిన పరిస్థితుల్లో ఇలా అడ్డుకునే ప్రయత్నాన్ని చాలా మంది పంపీణీ దారులు, ఎగ్జిబ్యూటర్స్ ఇది తప్పు అని గట్టిగా చెబుతున్నారు.