కంటెంట్ బేస్డ్, యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. కొత్త పాయింట్‌ను సరికొత్తగా చెప్పే మేకర్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘త్రిబాణధారి బార్భరిక్’ అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. సత్య రాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా ప్రతీ ఒక్కరి పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉందో టీజర్ చూస్తే తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సత్య రాజ్ కనిపించిన తీరు, డిఫరెంట్ లుక్స్, నటించిన విధానం ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి.
ఈ చిత్రానికి ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్-ఆర్ఆర్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర
సాంకేతిక బృందం
బ్యానర్ : వానర సెల్యూలాయిడ్
రచన & దర్శకత్వం : మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్
డీఓపీ : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇంఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్