అల్లరి నరేష్ `బంగారు బుల్లోడు` టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

Bangaru Bullodu First Look

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం `బంగారు బుల్లోడు` టైటిల్ తో హీరో అల్లరి నరేష్ అలరించబోతున్నారు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుఅల్లరి నరేష్ నటిస్తోన్న 55వ చిత్రమిది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్, పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆసాంతం ప్రేక్షకులను కామెడీతో మెప్పించనుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సమ్మర్ చివరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లరి నరేష్, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్ దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: రియల్ సతీష్, ఆర్ట్: ఎన్.గాంధీ, పి.ఆర్.ఒ: వంశీ శేఖర్, పబ్లిసిటీ ఇంచార్జ్: విశ్వ సి.ఎం, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.