Balakrishna: బాలయ్య‌ను ఢీకొట్ట‌నున్న శ్రీ‌కాంత్‌..

Balakrishna: నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కిన సింహ‌, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మ‌ళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతున్న క్ర‌మంలో ప్రేక్ష‌కులు ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంకు సంబంధించిన ఇప్ప‌టికే బాల‌య్య పోస్ట‌ర్ల్, టీజ‌ర్ ప్రేక్ష‌కులను, అభిమానుల‌ను ఎంతో అల‌రించాయి.

bb3

ఇక ఈ సినిమాలో Balakrishna బాల‌య్య‌ను ఢీకొట్టే పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ న‌టించ‌నున్నారు. శ్రీ‌కాంత్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విషెస్ తెలుపుతూ తాజాగా చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మిస్తుండ‌గా.. ఇందులో బాల‌య్య‌కు జోడీగా ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మే 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.‌