Balakrishna: హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీడీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న అభ్యర్థి కి తమ్ముడు బాలకృష్ణ మాట్లాడుతుండగా.. వీడియో తీసే ప్రయత్నం చేయగా.. బాలకృష్ణ అతన్ని కొట్టాడు. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై Balakrishna బాలయ్య చేతిలో చెంప దెబ్బ తిన్న యువకుడు స్పందించాడు.
నా పేరు సోము.. నేను బాలయ్య బాబు గారి అభిమానిని. బాలయ్యబాబు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. అయితే నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారుBalakrishna . అయినా మా బాలయ్య ఫ్యాన్స్ ఇలాంటివి పట్టించుకోవు.. ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన తాకడం నాకు ఎంతో సంతోషంగా ఉందని.. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. జై బాలయ్య జై తెలుగుదేశం. అంటూ వీడియోలో తెలిపాడు ఆ యువకుడు.