Rana: అర‌ణ్య నుంచి వీడియో సాంగ్ రిలీజ్‌..

Rana: భ‌ళ్లాల‌దేవ రానా న‌టించిన తాజా చిత్రం అర‌ణ్య‌.. ఈ చిత్రానికి ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రంలో రానాతో పాటు త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు..

Aranya

ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. తాజాగా ఈ Rana మూవీ నుంచి చిటికేసే ఆ చిరుగాలి లిరిక‌ల్ వీడియో రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ సాంగ్ ఆద్యంతం ప‌చ్చ‌ని అడ‌విలో అద్భుతంగా తెర‌కెక్కించార‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ సాంగ్ ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈRana చిత్రం మార్చి 26న తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.