Tollywood: బ‌న్నీ-స్నేహ 10వ‌ వివాహ వార్షికోత్స‌వం..

Tollywood: స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, స్నేహ దంప‌తుల నేడు 10వ వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు. స్నేహ‌రెడ్డిని ప్రేమించి పెళ్లాడిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రికి అల్లు అయాన్, అల్లు అర్హ పిల్ల‌లు ఉన్నారు. ఇక అల్లుఅర్జున్ పుష్ప చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్న త‌న కుటుంబంతో ఎంతో ఉల్లాసంగా గ‌డుపుతారు. కుటుంబానికి కావ‌ల్సినంత ప్రాధాన్య‌త ఇస్తారు.

bunny

ఈరోజు బ‌న్నీ-స్నేహ దంప‌త‌లు 10వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా భార్య‌తో క‌లిసి తాజ్‌మ‌హల్ సంద‌ర్శించారు. తాజ్‌మ‌హల్ ముందు వీరు ఫోటోలు దిగారు. ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశాడు. మ‌న 10వ వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు క్యూటీ.. ఈ ప‌ది సంవ‌త్సరాల ప్ర‌యాణం ఎంతో అద్భుతంగా జ‌రిగింది. ఇక‌ముందు కూడా ఇలాంటి మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని Tollywood బ‌న్నీ రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరిద్ద‌రికి వివాహ శుభాకాంక్ష‌లు తెలిపారు.