Sampurneshbabu: బ‌ర్నింగ్ స్టార్ “బ‌జార్ రౌడీ” టీజ‌ర్ రిలీజ్‌..

Sampurneshbabu: బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం బ‌జార్ రౌడీ. కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి డి. వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో.. కె ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సంధి రెడ్డి, శ్రీ‌నివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ గ్లిమ్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల్లో బ‌ర్నింగ్‌స్టార్‌పై విప‌రీతంగా అబిమానం పెరిగింది.. కాగా తాజాగా ఈ చిత్రంకు సంబంధించి టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

bajar rowdy

రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్ దాంట్లో రౌడీలు కాదురా ద‌మ్ము ద‌మ్ము ఉండాలి అంటూ Sampurneshbabu సంపూ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభం కాగా.. ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈచిత్రంలో మ‌హేశ్వ‌రీ, సాయాజీషిండే, క‌త్తి మ‌హేశ్‌, క‌రాటే క‌ళ్యాణి, ష‌ఫీ, పృథ్వీరాజ్‌, నాగినీడు, గోపీ నాయుడు, స‌మీర్ వంటి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. త్వ‌ర‌లో తెర‌పై రాబోయే ఈ చిత్రానికి సాయి కార్తీక్ స్వ‌రాలు అందించారు.