Bollywood: గంగూభాయ్‌పై కేసు.. ఆలియా, భ‌న్సాలీల‌కు కోర్టు స‌మ‌న్లు!

Bollywood: బాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం గంగూభాయ్ క‌తియావాడి. ప్ర‌ధాన పాత్ర‌ల్లో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ న‌టిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు వివాద‌స్ప‌ద‌మైంది. ఈ సినిమాలో గంగూభాయ్‌ను కించ‌ప‌రిచేలా స‌న్నివేశాలున్నాయ‌ని పేర్కొంటూ ఆమె ద‌త్త పుత్రుడు రాజీవ్ షా కోర్టులో ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ, Bollywood న‌టి అలియాపై ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీంతో వీరిద్ద‌రికి ముంబై మెట్రో పాలిట‌న్ మేజిస్ట్రేట్ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. మే 21న కోర్టులో హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ ఈ సినిమా ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది.

gangubhai movie

కాగా ఈ Bollywood సినిమాలో గంగూభాయ్‌ని కించ‌ప‌రిచేలా చూపించార‌ని పేర్కొంటూ ఇటీవ‌లే ఆమె ద‌త్త పుత్రుడు రాజీవ్ షా కోర్టును ఆశ్ర‌యించాడు. ఈ సినిమాలోని స‌న్నివేశాలు త‌న త‌ల్లిని నెగెటివ్‌గా చూపించారని.. స‌మాజంలో ఆమె గౌర‌వానికి భంగం వాటిల్లే అవ‌కాశ‌ముంద‌ని రాజీవ్ షా కోర్టుకు తెలిపాడు. ఇదిలా ఉంచితే.. ముంబాయి మాఫియా క్వీన్ గంగూభాయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని.. ప్ర‌ముఖ ర‌చ‌యిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబ‌యిని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈBollywood చిత్రం జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.