మంగళవారం, జేమ్స్ కామెరాన్ బృందం అవతార్ సీక్వెల్ షూటింగ్ కి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోను రిలీజ్ చేసింది. ప్రతిభావంతులైన నటి కేట్ విన్స్లెట్ నీటి అడుగున నటించిన విధానం ఎంతో ఆసక్తిగా ఉంది. ఫోటోలో, స్విమ్ సూట్ ధరించి, అవతార్ చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ దిగువన తనను తాను మునిగిపోయేలా కేట్ నడుము చుట్టూ బరువులు ధరించిన విధానాన్ని చూడవచ్చు.
కేట్ పాత్ర యొక్క వివరాలు ఇంకా తెలియలేదు గాని, చిత్ర యూనిట్ మాత్రం ఆమె ఫస్ట్ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో ప్రవేశపెట్టింది, ఈ సెలబ్రేటి ఇటీవలి ఇంటర్వ్యూలలో ఒక విషయాన్ని చెప్పింది. అవతార్‌లో పాత్రను పోషించడానికి ఎలా ఫ్రీ-డైవ్ చేయాలో నేను నేర్చుకోవలసి వచ్చింది, మరియు ఇది కేవలం నమ్మశక్యం కాదు. శ్వాస పట్టు ఏడు నిమిషాల 14 సెకన్లు ఉంటుందని తెలిపారు. ‘టైటానిక్’ హిట్ అయిన తర్వాత కేట్ విన్స్లెట్ మరియు జేమ్స్ కామెరాన్ కలిసి చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. కరోనావైరస్ ఆందోళనల కారణంగా మార్చిలో సీక్వెల్స్ కోసం షూట్ నిలిపివేయబడగా.. , జూన్‌లో న్యూజిలాండ్‌లో లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు, మేకర్స్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
అవతార్ మొదటి సీక్వెల్ డిసెంబర్ 2021 లో విడుదల చేయాలని అనున్నప్పటికీ, ఉహించని ఆలస్యం కారణంగా, తేదీని డిసెంబర్ 2022కి షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
From Kate Winslet's recent interview in @THR: “I had to learn how to free-dive to play that role in Avatar, and that was just incredible. My longest breath hold was seven minutes and 14 seconds, like crazy, crazy stuff.” pic.twitter.com/ZYAmZdNgHS
— Avatar (@officialavatar) October 26, 2020