రూ.50కే సినిమా టికెట్

యశ్ రాజ్ ఫిల్మ్స్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా యశ్ రాజ్ ఫిల్మ్స్‌ సూపర్ హిట్ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలని ఆ సంస్థ నిర్ణయించింది. రూ.50కే టికెట్లను విక్రయించాలని భావించింది. బిగ్ సినిమాస్, ఐనాక్స్, పీవీఆర్, సినీపోల్స్‌లో ఈ సినిమాలు ప్రదర్శించబడనున్నాయి.

yash raj films

‘కబీ కబీ’, ‘సిల్సిలా’, ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’, ‘దిల్ తో పాగల్ హై’, ‘వీర్-జారా’, ‘రబ్ నే బనా డి జోడి’, ‘ జబ్ తక్ హై జాన్ ‘,’ బ్యాండ్ బాజా బారాత్ ‘,’ సుల్తాన్ ‘,’ మర్దానీ ‘,’ దమ్ లగా కే హైషా’ సినిమాలను థియేటర్లలో మళ్లీ ప్రదర్శించనుంది.

లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. దీంతో నిర్మాతలు పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీపావళి పండుగ రావడంతో ప్రేక్షులను థియేటర్ల వైపు తీసుకొచ్చేందుకు గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ప్రదర్శించాలని యశ్ రాజ్ ఫిల్మ్ నిర్ణయించింది.