సిక్స్ ప్యాక్ శౌర్య.. ఇలా తయారయ్యాడేంటీ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినిమా కోసం అతడు సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా శౌర్యను సిక్స్ ప్యాక్‌లో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. తన సిక్స్ ప్యాక్ లుక్‌ను నాగశౌర్య స్వయంగా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

naga sourya six pack

ఇందులో తలపై హ్యాట్ పెట్టుకుని కౌబాయ్‌లో శౌర్య కనిపించాడు. ఇది చూసి నాగశౌర్య ఇందలా మారిపోయాడేంటి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఖాళీ దొరకడంతో ఫిట్‌నెస్‌పై నాగశౌర్య మరింత దృష్టి పెట్టి సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్యతో శౌర్య ఒక సినిమా చేస్తుండగా.. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇక నార్ట్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో కూడా నాగశౌర్య నటిస్తుండగా.. దీనిని సంతోష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల్లో నటిస్తూ శౌర్య బిజీబిజీగా ఉన్నాడు.