‘BB3’లో బాలయ్య పక్కన హీరోయిన్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హాట్రిక్ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ మూడో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సయేషా సైగల్‌ను ఫిక్స్ చేశారు. త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్‌లో బాలయ్యతో పాటు సయేషా పాల్గొననుంది.

SAHESHA SEGAL

గతంలో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన అఖిల్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఈ భామ ఇప్పుడు మళ్లీ బాలయ్య-బోయపాటి సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.

బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన సాహేషా.. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలతో గుర్తింపు పొందింది. తమిళ హీరో ఆర్యను 2019లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది సయేషా