ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘం గత కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూను కొట్టివేసిన హైకోర్టు. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని భావించింది.
ప్రజారోగ్యం కారణంగా షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరు వర్గాల వాదనలు వినింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.