“రైతుబంద్” పేరుతో సినిమా తీస్తున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి!

పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి దిల్లీ రైత‌న్న‌ల పోరాటాన్ని రైతు బంద్ పేరుతో సినిమాను తెర‌కెక్కించునున్నారు. అన్న‌దాత‌ల నిర‌స‌న‌కు కార‌ణ‌మైన కేంద్ర సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా త‌న సినిమా ఉంటుంద‌ని నారాయ‌ణమూర్తి వెల్ల‌డించారు. అలాగే ఫిబ్ర‌వరిలో ఈ చిత్రం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఆలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు.

r narayanamurthi

ఈ నేప‌థ్యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై విప్ల‌వ పంథాలో చిత్రాల‌ను తీసే నారాయ‌ణ‌మూర్తి ఈ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. రైతు సంఘాల ప్ర‌తినిధుల‌కు, కేంద్ర మంత్రుల‌కు చాలా సార్లు చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ రైతుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొర‌క‌లేదు. అలాగే కొత్త చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల్సిందేన‌ని అన్న‌దాతలు ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు చేసుకుంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.