డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. ఆ నటీమణుల ఫోన్లలో శృంగార వీడియోలు..

కర్ణాటక యొక్క సంచలనాత్మక డ్రగ్స్ రాకెట్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రముఖ నటీమణులు సంజన మరియు రాగిని ద్వివేదిలను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక వారి బెయిల్ ని తిరస్కరించిన విషయం తెలిసిందే. పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం, వారి ఫోన్ డేటాలో మోడల్స్ మరియు నటీమణుల సెక్స్ వీడియోలు ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి.

నటీమణుల ఫోన్‌ల నుండి తొలగించిన వాట్సాప్ గ్రూపును అధికారులు తిరిగి పొందగలిగారు. ఆ గ్రూప్ లో చాలా మంది నటీమణుల నగ్న చిత్రాలు, శృంగార వీడియోలు ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియోలు కనుగొనడంతో సెక్స్ రాకెట్లతో సంబంధాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. పోలీసులు ఇతర సభ్యులను అతి త్వరలో విచారించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే, వాట్సాప్ గ్రూపులో నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్న నటీమణులు, మహిళలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు డ్రగ్స్ రాకెట్ నుంచి సెక్స్ రాకెట్ వైపు యూ టర్న్ తీసుకోవడంతో కన్నడ చిత్ర పరిశ్రమలోఒక్కసారిగా ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.