బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పటి నుంచి కూడా రియా చక్రవర్తి పలు రకాల కేసులతో చట్టపరమైన విచారణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమెను ఫైనల్ గా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో గత రెండు రోజులుగా రియాను అధికారులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఆమె సుశాంత్ కి డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలడంతో NCB అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని సిగరెట్ అలవాటు తప్ప మరొకటి లేదని ఇన్వెస్టిగేషన్ లో తేల్చి చెప్పింది. కానీ NCB ఆఫీసర్స్ ఆమె వైద్య పరిక్షలు నిర్వహించబోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తరువాత అతని మరణానికి కారణం రియా చక్రవర్తి అనే ఆరోపణల చాలానే వచ్చాయి. కానీ కేసులో ఉహీంచని విధంగా డ్రగ్స్ వ్యవహారం ఉన్నట్లు తేలడంతో NCB గత కొన్ని రోజులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇక త్వరలో మరికొందరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ప్రశ్నించిన తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు, సూర్యాస్తమయానికి ముందే ఈ రోజు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆమె వైద్య పరీక్ష చేయించుకుంటారు. మహిళా ఖైదీల కోసం ఎన్సిబి కార్యాలయంలోనే తాత్కాలిక లాకప్ కూడా తయారు చేయబడిందని, రియా వారి అదుపులోనే ఉండనున్నట్లు సమాచారం.