టాలీవుడ్ హీరోపై చీటింగ్ కేసు

ఒక టాలీవుడ్ హీరో చీటింగ్ కేసులో చిక్కుకోవడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ‘మౌనమేలనోయి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సచిన్ జోషి.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన అతడు… ప్రస్తుతం పలు బిజినెస్‌లు చేస్తున్నాడు.

CASE ON SACHIN JYOSHI

అయితే మూడు నెలల క్రితం ఒక కేసులో చిక్కుకున్న సచిన్ జోషిపై తాజాగా మరో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పుణె పోలిస్ స్టేషన్‌లో సచిన్ జోషిపై అతడి మిత్రుడు పరాగ్ సంఘ్వి ఫిర్యాదు చేశాడు. తనకు చెల్లించాల్సిన రూ.58 కోట్లు చెల్లించలేదని, చెల్లిస్తానని చెప్పి చీటింగ్ చేశాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సచిన్ జోషిపై FIR నమోదు చేశారు.

సచిన్, పరాగ్ సంఘ్వీ కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. వీకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జోషి అండ్ పార్టనర్స్‌తో సంఘ్వి కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. ఒప్పందం ప్రకారం ప్లే బాయ్ బీర్ గార్డెన్ ఫ్రాంచైజ్‌కు చెందిన కోరెగావ్ పార్క్‌కు సచిన్ జోషి రూ.58కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ 2016 నుంచి పరాగ్ సంఘ్వికి సచిన్ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో పరాగ్ సింఘ్వి పుణె పోలీసులు ఫిర్యాదు చేయగా.. దీనిపై పుణె పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది.