గాయ‌నీ సునీత రెండో వివాహంపై క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌లు!

కాంట్ర‌వ‌ర్సీస్‌కీ కేరాఫ్ అడ్ర‌స్‌ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్‌, గ‌తంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచిన క‌త్తి ఆ త‌ర్వాత దేవుళ్లు, రాజ‌కీయాలు త‌దిత‌ర అంశాల‌కి సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఓ సారి ఆయ‌న అభ్యంత‌ర వ్యాఖ్య‌లు చేసి హైద‌రాబాద్ బ‌హిష్క‌ర‌ణ‌కు సైతం గుర‌య్యారు. కానీ ఈ సారి నెగెటివ్ కామెంట్స్ చేసేవారిపై రెచ్చిపోయాడు క‌త్తి మ‌హేశ్. తాజాగా.. ప్ర‌ముఖ గాయ‌నీ సునీత- మ్యాంగో రామ్ వీర‌ప‌నేని వివాహంపై కొంద‌రు సోష‌ల్‌మీడియా వేదిక‌గా నెగెటివ్ కామెంట్స్ చేశారు. పెళ్లీడుకొచ్చిన పిల్ల‌ల్ని పెట్టుకుని క‌న్న‌త‌ల్లి మ‌ళ్లీ వివాహం చేసుకోవ‌డం ఏంటి? అంటూ పోస్టులు పెట్టారు.

kathi mahesh

కాగా ఇలాంటి విమ‌ర్శ‌లు చేసేవారిపై ఫేస్‌బుక్ వేదిక‌గా క‌త్తి మ‌హేశ్ త‌న‌దైన శైలిలో స్పందించాడు. ప్ర‌ముఖ గాయ‌నీ సునీత రెండో పెళ్లి చేసుకున్నా మ‌నోభావాలు దెబ్బ‌తీసుకుంటారేంటి ఈ బ‌త్తాయిలు అంటూ పోస్ట్ చేశాడు క‌త్తి. అలాగే ఈ క‌ళ్ల‌లో ఆనందం చూస్తే ఎందుకో ఇబ్బంది..? అరే.. ఎదో బాధ్య‌త‌తో పెళ్లి చేసుకుంటారు. ఎవ‌రినైనా ఉద్ధ‌రించ‌డానికి పెళ్లిచేసుకుంటారు. బాధ‌ల్లో ఉంటే ఓదార్చ‌డానికి, ఆదుకోవ‌డానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం.. ఆనందం కోసం.. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని సంతోషంగా కనిపిస్తే.. హ‌మ్మో! ఎంత క‌ష్టం.. ఎంత క‌ష్టం.. ఎదో రెండో పెళ్లి చాటుమాటుగా చేసుకుని, గిల్ట్ ఫీల‌వుతూ ఏడుపు ముఖాల‌తో క‌నిపించాలిగానీ, ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి? ఆ క‌ళ్ల‌లో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? స‌మాజం నాశ‌నం అయిపోదా.. హ‌మ్మా!!! స‌మాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్న‌ట్టు? ఛ‌స్ ఆయ్‌!! అంటూ సునీత రెండో వివాహంపై నెగెటివ్ కామెంట్స్‌ చేస్తున్న వారిపై సెటైర్లు వేశాడు క‌త్తి.