అల్లు అర్జున్ తో డాన్స్ చేయనున్న యానిమల్ హీరోయిన్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న సినిమా ‘పుష్ప : ది రూల్’. పుష్ప : ది రైజ్ ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 5న ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ చేసారు. అయితే ఈ సినిమా పనులు అన్ని సెరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పుష్ప : ది రైజ్ లో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో ఉ అంటావా మావ ఊఉ అంటావా మావ అంటూ వేసిన స్టెప్స్ కి అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే ఇప్పుడు రాబోయ్తున్న పుష్ప : ది రూల్ లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం సమంత ను అడగగా ఆమె తిరస్కరించినట్లు సమాచారం. అయితే చివరగా యానిమల్ సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. అయితే ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ వచ్చే వరుకు వేచి చూడాల్సిందే.